కడపలో మున్సిపల్ కార్పోరేషన్ సమావేశం..! 13 h ago
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నవంబర్ 7న కుర్చీ వివాదం ఘటనలో వాయిదాపడిన సమావేశాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ సమావేశంలో వైకాపా పాలకవర్గం .. వేదికపై ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేయలేదు. మేయర్ మాత్రమే కూర్చునే సదుపాయం కల్పించారు. సమావేశానికి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరుకానున్నారు.